కళకళలాడిన కళ్యాణిఖని వెలవెల బోయే ప్రమాదం ముంచుకొస్తుందా! .
అర్జున్ సమాచారం.. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 18 .
ఏజెన్సీ ప్రాంతమైన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బొగ్గు గనులకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం బెల్లంపల్లి రీజియన్ అటు శ్రీరాంపూర్ మొదలుకొని గోలేటి వరకు విస్తారంగా బొగ్గు గనులు వెలసిన ప్రాంతం కానీ నూతన ఆర్థిక సరళీకరణ పేరుతో దేశంలోని అనేక పరిశ్రమలు ప్రైవేటు కాంట్రాక్టర్ల పెట్టుబడిదారుల చేతుల్లోకి వెలుతున్న పరిస్థితుల దృష్ట్యా మందమర్రి ప్రాంతం కూడా నూతన గనులు ప్రారంభించడానికి గ్రహణం పట్టడంతో అనతి కాలంలో కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ముంచుకొస్తుందా అంటే అవుననే సమాధానమే కనిపిస్తుంది గతంలో రామకృష్ణాపూర్ మందమర్రి ప్రాంతాలలో 20కి పైగా గనులు బొగ్గు ఉత్పత్తిలో ముందుండేవి కాలక్రమేన గనులన్నీ మూసివేతకు గురవుతూ రోజు రోజుకు కార్మికుల సంఖ్య క్షీణించడం మొదలయ్యింది ఉదాహరణకు మందమర్రిలో కేకే 1 కేకే 2 ఎస్ ఎం జి 1.1 ఎస్ ఎం జి 3 కేకే 3 3 ఏ కేకే 5 5 ఏ గనులతోపాటు కేకే 5 సి ఎస్ పి కేకే 1 సి ఎస్ పి వర్క్ షాప్ స్టోర్ లతోపాటు నాలుగు డిస్పెన్సరీలు ఒక ఆసుపత్రి వీ టి సి గుట్కల షెడ్డు కంపెనీకి సంబంధించిన అంబులెన్స్. లు కంపెనీ లారీలు పెద్దపెద్ద మోటర్లు వాటిని నడిపేందుకు డ్రైవర్లు రిపేరు చేసేందుకు గ్యారేజీ ఇట్లా అనేకం కొనసాగుతూ వేలాది మంది కార్మికులు సంస్థలో విధులు నిర్వహిస్తే వాళ్లపై ఆధారపడి వ్యాపారస్తులు లక్షలాది మంది చిన్నచితక వ్యాపారాలు చేసుకునే పేదలు జీవించటానికి అనువైన ప్రాంతంగా సస్యశ్యామలం చెంది సమృద్ధి వనరులతో తులతూగిన ప్రాంతం కానీ నేడు నూతన ఆర్థిక సరళీకరణ పేరుతో సంస్కరణల పుణ్యమా అని బొగ్గు గనులను ప్రారంభించుకోవడానికి అనేక ఆంక్షలు ఎదురవడం సంస్థ ద్వారా సర్వే చేసుకున్న గనులను కూడా ప్రారంభించుకోవడానికి ఎన్నో రకాల అడ్డంకులు రావడంతో ప్రస్తుతం మందమర్రి కళ్యాణికని ప్రాంతం వెలవెలబోతోంది అంతేకాకుండా అనతి కాలంలోనే చరిత్ర పుటల నుండి కనుమరుగయ్యే ప్రమాదం కూడా ముంచుకొస్తుంది ఇప్పటికీ ఇక్కడి మార్కెట్ మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది ఇదంతా ఇంకెంతో కాలం మిగలదేమోనని భయం ఇక్కడి జనాలను వెంటాడుతుంది లక్ష వరకు ఓటర్లు ఉన్న ఈ ఏరియా నేడు సుమారు 60 వేల వరకు ఓటర్లు మిగిలి ఉన్నారు ఇది కూడా ఇక్కడ నుండి బెల్లంపల్లి మంచిర్యాలకు ఉద్యోగాలకు వెళ్లేవారు కొందరైతే షాపులలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు ఆ ప్రాంతంలో ఇంటికి రాయిలు విపరీతంగా ఉండడంతో భరించలేక ఇక్కడ నుండే రాకపోకలు సాగిస్తున్నారు కనుక ఏమాత్రమైన జనాలతో ఈ ప్రాంతం సందడిగా కనిపిస్తుంది రానున్న మూడు సంవత్సరాలలో కేకే 5 గని కూడా మూసివేతకు గురవుతుందనే భయం అందరిలో ఆందోళన కలిగిస్తుంది అదే గనుక జరిగితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న సర్వత్ర అందరిని భయానికి గురి చేస్తూ వేధిస్తుంది ఓట్ల కోసం వచ్చే ప్రతినిధులు మాత్రం ఓట్లు పొందే దాకా ఈ ప్రాంతానికి డోకా ఉండదని అభయమిస్తూ నూతన గనులు తెస్తామని హామీలు గుప్పిస్తూ వాళ్ల వ్యవహారాన్ని నడిపిస్తున్నారు ఓట్లు అయిపోయిన తర్వాత మళ్లీ ఇచ్చిన హామీలు చెప్పిన మాటలు అటకెక్కించి మళ్లీ 5 ఏళ్ల కదా మనం ఇటు వచ్చేది అప్పుడు ఎట్లయితే గట్ల అయితది చూసుకుందాంలే అనే దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు ప్రజల్లో రోజురోజుకు ఈ భయం రెట్టింపు రేపటి పరిస్థితులు ఏంటో అర్థం కాక సామాన్య ప్రజలతోపాటు కార్మిక కుటుంబాలు వ్యాపారస్తులు భయానక ఆందోళనకు గురవుతున్నారు అంతులేని అయోమయాల మధ్య ఈ ప్రాంత బడుగు జీవులు దినదినం గండంగా బతుకులేల్లదీస్తున్నారూ అతి తక్కువ కాలంలోనే ఈ పరిణామాలన్నీ జనాల మీద గుది బండగా మారే పరిస్థితిలు దినదినం జనాల దరికి చేరువవుతూనే ఉన్నాయి దీనిపైన రాజకీయ నాయకులు కార్మిక సంఘాలు ఏ విధమైన హామీని ఇక్కడి ప్రజలకు అందించకుండా మిన్నకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. మరి మరి రాజకీయ పార్టీల నాయకులు కార్మిక సంఘాల నేతలు ప్రజలకు ఏ విధమైన భరోసానిచ్చి ముందుకు సాగుతారు వేచి చూద్దాం